18-12-2025 01:42:50 AM
మూడో విడతలోనూ కాంగ్రెస్‌దే అధిక్యం

హైదరాబాద్, డిసెంబర్ 17 (విజయక్రాంతి): తెలంగాణలో పల్లెపోరు ముగిసింది. మూడు విడతలుగా జరిగిన పంచాయతీ సమరంలో హస్తం పార్టీ నే పై‘చెయ్యి’ సాధించింది. మూడో విడతలో 4,159 గ్రామాలు, 36,452 వార్డులకు 394 గ్రామాలు, 7,908 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 3,752 గ్రామాలు, 28,410 వార్డులకు బుధవారం పోలింగ్ జరిగింది. ఇక మూడో విడతలో 85.77 శాతం ఓటింగ్ నమోదైంది. యాదాద్రి- భువగిరి జిల్లా 92.56 శాతం ఓటింగ్ నమోదుతో మూడో విడతలోనూ మొదటి స్థానంలో నిలిచింది.
రెండు, మూడో స్థానంలో మెదక్, సూర్యాపేట జిల్లాలు ఉండగా, చివరి స్థానంలో నిజామాబాద్ జిల్లా ఉన్నది. నిజామాబాద్‌లో 76.45 శాతంతో చివరి స్థానంలోకి వెళ్లింది. కాగా పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగలబోతుందని ప్రతిపక్షాలు చేసిన అంచనాలు తలకిందులయ్యా యి. పల్లెల్లో పట్టు కోసం నువ్వా.. నేనా అన్నట్లుగా సాగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు గెలిచినా ప్రధాన ప్రతిపక్ష బీఆర్‌ఎస్ గట్టి పోటీ ఇచ్చిం ది.
గ్రామీణంలో పెద్దగా ఆసక్తి కనబరచని కమలం పార్టీకి కూడా ఫలితాలు సంతృప్తిగానే వచ్చాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. స్వతంత్రులు వందల సంఖ్యలో విజయం సాధించగా వారిలో మెజార్టీగా కాంగ్రెస్ రెబల్స్ ఉన్నారు. గ్రామాల్లో బలమైన అభ్యర్థులను కాదని, డబ్బులున్న వారి నే కాంగ్రెస్ బలపర్చడం, మరికొన్ని గ్రామా ల్లో అసంతృప్తులను బుజ్జగించకపోవడంతోనూ కొంతమేర నష్టం జరిగిందనే చర్చ సొంత పార్టీలోనే జరుగుతోంది.
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్..
రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో మూడు విడతల్లో 12,728 గ్రామాలకు 11,497 గ్రామా లకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 1,205 గ్రామాలు ఏకగ్రీవం కాగా, 21 గ్రామాలకు వివిధ కారణాల వల్ల ఎన్నికలు జరగలేదు. 38,394 మంది సర్పంచ్ అభ్యర్థులుగా పోటీలో నిలిచారు. 1,12,242 వార్డులకు గా ను 25,848 వార్డులు ఏకగ్రీవం కావడంతో 85,955 గ్రామాలకు ఎన్నికలు జరిగాయి. వీటికి 2,12,251 మంది అభ్యర్థులు పోటీ చేశారు.
జిల్లాల వారిగా పోలింగ్ శాతం..
నిజామాబాద్ - 76.45, రాజన్న సిరిసిల్ల-79.14, జగిత్యాల-82.56, ఆదిలాబాద్- 83.15, నాగర్‌కర్నూల్-83.32, ఆసిఫాబాద్-83.55, నారాయాణపేట్-83.56, వికారాబాద్-83.88, ములుగు-84.02, భూపాలపల్లి-84.67, భద్రాద్రి కొత్తగూడెం-84.99, నిర్మల్-85.55, వనపర్తి- 85.66, పెద్దపల్లి- 85.95, కామారెడ్డి -86.22 , రంగారెడ్డి-86.42, కరీంనగర్-86.44, హన్మకొండ-87.43, సంగారెడ్డి-87.78, మంచిర్యాల్- 88.21, వరంగల్-88.36, మహబూబ్‌నగర్- 88.45, సిద్దిపేట-88.48, జనగాం-88.52, మహబూబాబాద్-88.54, గద్వాల- 88.72, నల్లగొండ- 88.84, సూర్యాపేట్- 89.25 , మెదక్-90.68 , యాదాద్రి- భువనరి-92.56 శాతం ఓటింగ్ నమోదైంది.
