18-12-2025 01:24:54 AM
పంచాయతీ ఎన్నికల్లో భారీగా మద్యం అమ్మకాలు
హైదరాబాద్, డిసెంబర్ 17 (విజయక్రాంతి) : పంచాయతీ ఎన్నికల నేప థ్యంలో పల్లెల్లో మద్యం ఏరులై పారిం ది. దీంతో ఆబ్కారీ శాఖకు భారీగా ఆదాయం వచ్చింది. డిసెంబర్ మొద టి వారంలోనూ 107 శాతం లిక్కర్ అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 2,620 మద్యం షాపులు ఉడగా, ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి షాపుల యజమానులు పెద్దమొత్తంలో స్టాక్ పెట్టుకున్నారు.
ఈ క్రమంలో సగటున వారానికి రూ. వెయ్యి కోట్ల మద్యం విక్రయం జరిగిన ట్లు ప్రాథమిక అంచనా. గడిచిన రెండు వారాల్లో దాదాపు రూ.2వేల కోట్ల వరకు లిక్కర్ సేల్స్ జరిగినట్లు సమాచారం. ఈ నెలలోనే సంవత్సరం ఎండింగ్ ఉండటంతో మద్యం అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. పం చాయతీ ఎన్నికలతో పాటు ఇయర్ ఎండిం గ్ కలిసివస్తుండటంతో ఈ నెలాఖరు నాటికి రూ. 4 వేల కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరిగే అకాశం ఉందని అబ్కారీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
భారీగా మద్యం పంపిణీ
ఈ నెల 11,14, 17 తేదీల్లో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 12,737 గ్రామా ల్లో ఓట్ల సందడి నెలకొన్నది. సర్పంచ్‌తో పాటు వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగా యి. ఒక్కో స్థానానానికి భారీగానే నామినేషన్లు పడ్డాయి. హైదరాబాద్ శివారు గ్రామా లతో పాటు ఇసుక, గ్రానైట్ క్వారీలు, పరిశ్రమలు ఉన్న గ్రామాల్లో సర్పంచ్ గిరికి క్రేజీ ఏర్పడింది. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థులు గెలుపు కోసం లెక్కకు మించి ఖర్చు చేశారు.
భూములు అమ్ముకుని, బంగారం కుదవపెట్టి, అప్పులు తీసుకుని ఎన్నికల బరిలోకి దిగారు. ఓటింగ్ చివరి వరకు విజయం కో సం సర్వశక్తులు ఒడ్డారు. ఈ క్రమంలో లిక్క ర్ పంపిణీ కూడా భారీగానే చేశారు. దీం తో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. రహ స్య ప్రాంతాల్లో డంపులు ఏర్పాటు చేసి ఇంటింటికీ పంపిణీ చేశారు.
నాలుగు రోజుల్లోనే రూ. 756కోట్లు..
ఈ నెల 1వ తేదీ నుంచి నాలుగో తేదీ వరకు కేవలం 4 రోజుల్లోనే రూ.756.34 కోట్ల విలువ చేసే మద్యం అమ్మకాలు జరిగా యి. ఈ నెల 1న రూ.183.5 కోట్లు, 2న రూ. 207 కోట్లు, మూడో తేదీన రూ. 187.52 కోట్లు, ౪న రూ. 178.29 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని వైన్స్ షాపు ల్లో ఎక్కువగా విక్రయాలు జరిగాయి.