18-12-2025 01:27:32 AM
హైదరాబాద్, డిసెంబర్ 17 (విజయక్రాంతి): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం (ఎంజీ నరేగా) పేరు మార్పు విషయంలో కాంగ్రెస్ కావాల నే రాద్ధాంతం చేస్తోందని, కేంద్ర ప్రభుత్వం పేరు మార్చుతూ తీసుకొచ్చిన వీబీ జీ రామ్ జీ2025 పథకం పేరులో రామ్ ఉందన్న కారణంతోనే కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు అన్నారు. గాంధీ పేరు పెట్టుకున్న ఫేక్ గాంధీలు వాళ్లని ఆయన కీలక వ్యాఖ్య లు చేశారు.
బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ కార్యాలయాల ముందు కాంగ్రెస్ నిరసనలు తెలిపితే ఊరుకునేది లేదని, తాట తీస్తామని హెచ్చరించారు. ఎన్టీ రామా రావు పేరు మార్చి రాజీవ్ గాంధీ పేరును గతంలో పెట్టలేదా? అది తప్పు కాదా? అని ప్రశ్నించారు. గాంధీ కోరి న రామ రాజ్యం, గ్రామ స్వరాజ్యానికి బీజేపీ కట్టుబడి ఉందని, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చ డం తప్పు కాద న్నారు. వారికి గాంధీపై అభిమానం ఉంటే మీ పేర్ల నుంచి గాంధీ తొలగించుకోవాలన్నారు.
రాజకీయ లబ్ధి కోస మే మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్నారని విమర్శించారు. అయినా నరేగా కింద 10 ఏండ్లలో కేంద్ర ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లు ఖర్చు పెడితే, కాంగ్రెస్ హయాంలో కేవలం రూ.లక్ష కోట్లే ఖర్చు చేశారన్నారు. నరేగా పథకాన్ని పక్కన పెట్టలేదని, ఉపాధి పనిదినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచామని, ఇంత చేసినప్పటికీ కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తంచేస్తుందని మండిపడ్డారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో కోర్టు ఇంకా తుది తీర్పు ఇవ్వలేదని, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నిర్దోషులని కోర్టు చెప్పలేదని, ప్ర స్తుతం వారు బెయిల్‌పై ఉన్నారని ఆయన గుర్తుచేశారు. గాంధీ పేరు వాడుకోవడం కా దు.. వారిని గౌరవిస్తూ, వారి ఆలోచనలను అమలుచేసేలా ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావడమే బీజేపీ విధానమన్నారు.