18-12-2025 01:30:11 AM
ఢిల్లీ, డిసెంబర్ 17 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ర్టంలోని మూడు కోట్ల మంది బీసీల ఆకాంక్షలను గౌరవించి, బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగా ల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ అసెంబ్లీలో చేసిన చట్టాన్ని ప్రస్తుతం జరిగే పార్లమెంటు సమావేశాల్లోనే ఆమోదించాలని బీసీ జేఏసీ తెలంగాణ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్.. కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిత మంత్రి వీరేంద్ర కుమార్‌కు విజ్ఞప్తి చేశారు.
బీఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో పార్లమెంటులోని కేంద్ర మంత్రి కార్యాలయంలో బీసీ జేఏసీ నేతలు బుధవారం భేటీ అయ్యారు. గత రెండు రోజులుగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఆందోళన చేపట్టిన బీసీ జేఏసీ నేతలు.. బుధవారం కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్‌ను కలిసి బీసీ డిమాండ్లపై పది నిమిషాలు చర్చించారు. ఈ సందర్భంగా ఐదు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కేంద్రమంత్రికి అందజేశారు.
చట్టబద్ధత కల్పించాలి: జాజుల
అనంతరం జాజుల శ్రీనివాస్‌గౌడ్ మా ట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్టంలో బీసీలు చేసిన పోరాట ఫలితంగా రాష్ర్ట ప్రభుత్వం డేడికిషన్ కమిషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా మొదటిసారి సమగ్ర కులగనన చేపట్టారని, తదుపరి బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో బీజేపీ, బీఆర్‌ఎస్, సీపీఐ, ఎంఐఎం, టీజేఎస్ పార్టీల మద్దతుతో ఏకగ్రీవంగా చట్టాన్ని ఆమోదించి ఢిల్లీకి పంపించారని గుర్తు చేశారు.
42% రిజర్వేషన్ చెల్లదని న్యాయస్థానాలు అడ్డుపడుతున్నాయని, సుప్రీంకోర్టు తీర్పు దరిమి లా రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి వీలులేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసు కొని రాష్ర్ట అసెంబ్లీలో చేసిన చట్టాన్ని పార్లమెంటు సమావేశాలలోనే రాజ్యాంగాన్ని సవరించి చట్టబద్ధత కల్పించాలని కోరారు.
బిల్లుకు మద్దతివ్వండి: వద్దిరాజు
బీఆర్‌ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. తెలంగాణలో అత్యధిక శా తం బీసీ జనాభా ఉన్నా విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తీరని అన్యాయం జరుగుతుందన్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ర్ట అసెంబ్లీలో చేసిన చట్టానికి బీఆర్‌ఎస్ కూడా మద్దతు తెలిపిందన్నారు. అసెంబ్లీలో చేసిన చట్టం 8 నెలలు గడుస్తున్నప్పటికీ ఆమోదం పొందడం లేదని, అందుకే ఈ పార్లమెంటు సమావేశాల్లో బీఆర్‌ఎస్ తరఫున ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టామని , కేంద్రం బీసీ బిల్లు ఆమోదించాలని కోరారు.
ప్రధానితో చర్చిస్తా: కేంద్ర మంత్రి వీరేంద్రకుమార్
బీసీ జేఏసీ నేతలు చెప్పిన డిమాండ్లను ఓపికగా విన్న కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ స్పందిస్తూ.. బీసీ రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని, ఇందిరా సహని కేసులో సుప్రీంకోర్టు రిజర్వేషన్లు 50 శాతం పరిమితి మించొద్దని తీర్పు ఇచ్చినందున కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల నుంచి బీసీ రిజర్వేషన్లు పెంచాలని వచ్చిన విజ్ఞప్తులను నిషితంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
బీసీ రిజర్వేషన్ అంశాన్ని త్వరలోనే ప్రధాని నరేంద్రమోదీతో చర్చిస్తానని ఆయన బీసీ నేతలకు హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రం గౌడ్, బీసీ జేఏసీ రాష్ర్ట కన్వీనర్ పెరిక సురేష్ ఉన్నారు.