calender_icon.png 18 December, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటమి భయంతోనే కాంగ్రెస్ ప్రలోభాలు

18-12-2025 01:20:23 AM

  1. రెండేళ్లలో మళ్లీ కేసీఆరే సీఎం 
  2. మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, డిసెంబర్ 17 (విజయక్రాంతి): ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు పాల్పడుతున్నదని మాజీ మం త్రి హరీశ్‌రావు విమర్శించారు. డబ్బు సంచులు, పోలీసులను అడ్డుపెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ బీఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మండలం మల్కాపూర్, కోనైపల్లి, నర్సంపల్లి గ్రామాల్లో బీఆర్‌ఎస్ తరఫున గెలిచిన సర్పంచులు, అచ్చంపేట నియోజకవర్గం సీఎం రేవంత్‌రెడ్డి సొంత మండలం వంగూరులో 10 గ్రామ పంచాయతీల్లో విజయం సాధించిన బీఆర్‌ఎస్ సర్పంచులను బుధవారం హై దరాబాద్‌లో హరీశ్‌రావు సత్కరించి, మాట్లాడారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో దిమ్మతిరిగే ఫలితాలు వచ్చాయని, ప్రజల తీర్పు చూసి కాంగ్రెస్ నాయకులకు షాక్ తగిలిందన్నారు. మొదటి దఫా ఫలితాలు చూసి షాక్ అయ్యారని, రెండో దఫా ఫలితాలు చూసి మైండ్ బ్లాక్ అయ్యిందని, మూడో దశ ఫలితాలు కూడా కాంగ్రెస్ పార్టీనీ నిరాశపరచక తప్పదని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో  ఢిల్లీ లో అవార్డులు ఇస్తే తెలంగాణ పల్లెల పేర్లు లేకుండా జాబితా ఉండేది కాదని, కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో తెలంగాణకు ఒక్క అవార్డు కూడా రాలే దన్నారు.

కేసీఆర్ ప్రతి నెలా పల్లెలకు నిధు లు విడుదల చేసేవారని, కానీ రేవంత్ రెడ్డి వచ్చాక రాష్ర్ట ప్రభుత్వ నిధులు, కేంద్ర ప్రభు త్వ నిధులు బంద్ అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని, దాడులు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చ రించారు. బీఆర్‌ఎస్‌లో గెలిచిన వారిని బలవంతంగా పార్టీలో చేర్చుకోవాలని చూసినా కుదరదని,  ఎందుకంటే బీఆర్‌ఎస్ కార్యకర్త లు ఉద్యమకారులని గుర్తుంచుకోవాలని, వారు మీ బెదిరింపులకు లొంగరని స్పష్టం చేశారు.

దేశం వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా వెళ్తోందని, బహుశా మరో ఆరు నెలల్లోనో ఏడాదిలోనో ఎన్నికలు రావచ్చని జోస్యం చె ప్పారు. రెండేళ్లలో కచ్చితంగా మళ్ళీ వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే.. మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.