calender_icon.png 18 December, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘తుది’ పోరు ప్రశాంతం

18-12-2025 02:21:23 AM

ముగిసిన పంచాయితీ ఎన్నికలు 

మహబూబాబాద్, డిసెంబర్ 17 (విజయక్రాంతి) : పంచాయతీ ఎన్నికల తుది పోరు బుధవారం ప్రశాంతంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముగిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తుది విడత 564 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా 34 పంచాయతీల్లో ఏకగ్రీవంగా సర్పంచ్లను ఎన్నుకున్నారు. మిగిలిన 530 గ్రామపంచాయతీలకు, వార్డు సభ్యుల ఎన్నికకు బుధవా రం పోలింగ్ నిర్వహించారు. 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 78, మహబూబాబాద్ జిల్లాలో 150, హనుమకొండ జిల్లాలో 67, వరంగల్ జిల్లాలో 100, జనగామ జిల్లాలో 88, ములుగు జిల్లాలో 145 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు.  బుధవారం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణను సజావుగా నిర్వహించడానికి పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఆయా జిల్లాల ఎస్పీలు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఆయా జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరిష్, రాహుల్ శర్మ, రిజ్వాన్ భాషా షేక్, దివాకర టిఎస్, సత్య శారద, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్ కుమార్ తదితరులు ఎన్నికల ఏర్పాట్లను, పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. వీరికి తోడు ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేకంగా నియమించిన పరిశీలకులు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఎప్పటికప్పుడు పోలింగ్ తీరును సమీక్షించారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు 84.02 శాతం పోలింగ్ నమోదు కాగా, కాటారం మండలంలో 82.28, మహదేవ్పూర్ లో 84.38 మహా ముత్తారం లో 86.42 మలహర్రావు మండలంలో 83.80 శాతం పోలింగ్ నమోదయింది. ఇక మహబూబాబాద్ జిల్లాలో 88.52 శాతం పోలింగ్ నమోదు కాగా, డోర్నకల్ మండలంలో 91.11, గంగారం లో 84.98, కొత్తగూడలో 83.41, కురవిలో 87.73, మరిపెడలో 89.92, సీరోల్ మండలంలో 90.12 శాతం నమోదయింది. 

ఇక వరంగల్ జిల్లాలో 88.21 శాతం పోలింగ్ నమోదు కాగా, చెన్నారావుపేట మండలంలో 89.83, ఖానాపూర్ మండలంలో 87.75, నర్సంపేటలో 87.84, నెక్కొండలో 87.54 శాతం పోలింగ్ నమోదయింది. ఇక హనుమకొండ జిల్లాలో 86.44 పోలింగ్ నమోదు కాగా, ఆత్మకూరు మండలంలో 87.43, దామెర మండలంలో 89.5, నడికుడా మండలంలో 85.0, శాయంపేట మండలంలో 84. 74 శాతం పోలింగ్ నమోదయ్యింది.

ఇక ములుగు జిల్లాలో 82.56 శాతం పోలింగ్ నమోదు కాగా, కన్నాయి గూడెం మండలంలో 82.79, వెంకటాపురం మండలంలో 81. 07, వాజేడు మండలంలో 84.39 శాతం పోలింగ్ నమోదయింది. జనగామ జిల్లాలో మొత్తంగా 83.27 శాతం పోలింగ్ నమోదు కాగా, పాలకుర్తి మండలంలో 80.06, దేవరుప్పుల మండలంలో 87.64, కొడకండ్ల మండలంలో 83.39 శాతం పోలింగ్ నమోదయింది.

‘పండగ’లా పంచాయతీ ఎన్నికలు..!

అందంగా పోలింగ్ కేంద్రాల ముస్తాబు ఓటర్లకు ఘనస్వాగతం 

పంచాయతీ ఎన్నికలను వరంగల్ జిల్లా లో కలెక్టర్ సత్య శారద పండగలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయించారు. ప ర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం పై ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించడానికి జిల్లావ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో ‘హరిత’ పోలింగ్ కేంద్రాలను ఏర్పా టు చేశారు. పోలింగ్ కేంద్రాల ప్రధాన ద్వారం వద్ద ఆకులు, పూలతో తోరణాలు కట్టి , ఓటెయ్యడానికి వచ్చే ఓటర్లకు పూలు అందించి అపూర్వ రీతిలో స్వాగతం పలికారు.

ఇక ఖానాపురం పోలింగ్ కేంద్రంలో మహిళ ఓటర్లకు గోరింటాకు కూడా పెట్టారు. హరిత పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేకంగా ఆకులు, పూలతో సెల్ఫీ పాయింట్లు ఏర్పా టు చేశారు. ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. జిల్లాలోని లక్నేపల్లి, ఇ టుకలపల్లి, ఖానాపూర్, రాగంపేట, ఉప్పరపల్లి, తిమ్మరాయని పహాడ్, రెడ్లవాడ, అలంకానిపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన హరిత పోలింగ్ కేంద్రాలు ఓటర్లను ఆకర్షించాయి.

 మహబూబాబాద్, విజయక్రాంతి