03-01-2026 12:00:00 AM
మేడ్చల్ అర్బన్, జనవరి 2 (విజయక్రాంతి): మేడ్చల్ ఆర్టీసీ డిపోలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని డిపో మేనేజర్ కె పరిమళ తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ సిఐ సత్యనారాయణ పాల్గొని డ్రైవర్ కండక్టర్ లు తీసుకోవలసిన జాగ్రత్తలు ప్రమాదాలను నివారించడం గురించి వివరించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఆర్టిసి అసిస్టెంట్ మేనేజర్ జి రామారావు. అసిస్టెంట్ ఇంజనీర్ వి స్నేహలత. ఆఫీస్ సూపరిండెంట్ పిఎస్‌ఎన్ రావు తోపాటు డిపో సిబ్బంది పాల్గొన్నారు.