03-01-2026 12:00:00 AM
ప్రజల కోసం అంకితభావంతో పోరాడిన నేత ఏపీ బర్దన్
సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా
సీపీఐ జిల్లా కార్యాలయంలో ఘనంగా బర్ధన్ వర్ధంతి
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 2 (విజయక్రాంతి): కమ్యూనిస్టు ఉద్యమానికి, ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి ఏ బి బర్ధన్ పదో వర్ధంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తొలుత బర్ధన్ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో సాబీర్ పాషా మాట్లాడుతూ, ఏపీ బర్దన్ తన జీవితమంతా కార్మికులు, రైతులు, పేద ప్రజల హక్కుల కోసం అంకితభావంతో పోరాడారని, పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి, ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించిన మహానేతగా బర్దన్ చరిత్రలో నిలిచారన్నారు.
పార్లమెంటరీ వ్యవస్థలోనూ, ఉద్యమ రంగంలోనూ కమ్యూనిస్టు విలువలను కాపాడుతూ ముందుకు నడిపించిన నేత అని పేర్కొన్నారు. మతోన్మాద, కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటం నేటికీ ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. బర్దన్ బాటలో నడుస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి కమ్యూనిస్టుపై ఉందని అన్నారు. నివాళులర్పించిన వారిలో సిపిఐ జిల్లా నాయకులు జి వీరాస్వామి, దమ్మాలపాటి శేషయ్య, వంగ వెంకట్, భూక్యా శ్రీనివాస్, పట్టణ నాయకులు మాచర్ల శ్రీనివాస్, ధర్మరాజు, రాములు, బోయిన విజయ్ కుమార్, సత్యనారాయణాచారి, మాతంగి లింగయ్య, మల్లయ్య, ధనలక్ష్మి, షాహీన్ పాల్గొన్నారు.