26-09-2025 07:38:52 PM
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అల్వాల వీరయ్య
మరిపెడ మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్
మరిపెడ(విజయక్రాంతి): మహబూబాద్ జిల్లా మరిపెడ మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించి ఉపాధి కూలీలను ఆదుకోవాలని సిపిఎం మహబూబాద్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు హల్వాల వీరయ్య ప్రభుత్వాన్ని మరిపెడ మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్ డిమాండ్ చేశారు. శుక్రవారం రోజున సిపిఎం ఎల్లంపేట గ్రామ జనరల్ బాడీ సమావేశం అల్వాల పురుషోత్తం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వీరయ్య మాట్లాడుతూ... ఎల్లంపేట గ్రామంలో ఏప్రిల్ మాసంలో చేసిన ఉపాధి కూలీలకు రెండు వారాల నుండి నాలుగు వారాల డబ్బులు చెల్లించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తున్నది.
కాలయాపన చేస్తుందని పనులు చేసి ఐదు నెలలు దాటిన కూలీలకు డబ్బులు చెల్లించ కుండా కూలీలను అవస్థల గురిచేస్తుందని వారన్నారు. అదేవిధంగా మరిపెడ మండల వ్యాప్తంగా వేల సంఖ్యలో కూలీలకు రూ.లక్షలాది పెండింగ్ బిల్లులు నిలిచిపోయాయని, వెంటనే చెల్లించి కూలీలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉపాధి కూలీలు సమీకరించి ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు అదేవిధంగా గ్రామంలో నెలకొన్న స్థానిక సమస్యలు సైడ్ డ్రైనేజీ వ్యవస్థను వీధిలైట్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.