26-09-2025 11:39:29 PM
నాగారం: ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని వర్ధమానుకోట గ్రామంలో దుర్గా దేవి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికతను అలవర్చుకొని దైవ భక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. దుర్గా దేవి ఆశీస్సులతో మండల ప్రజలు అందరు సుఖ శాంతులతో వర్ధిల్లాలని వేడుకున్నారు.