calender_icon.png 27 September, 2025 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరితగతిన ఇళ్లు నిర్మించుకోవాలి

26-09-2025 07:33:21 PM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో అర్హులైన ప్రతి నిరుపేద ఆడబిడ్డకు ఇంటిని నిర్మించి ఇవ్వాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని కాంగ్రెస్ మండల నాయకుడు ఎడ్ల సైదులు అన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఆదేశానుసారం మాజీ డీసీసీబీ చైర్మన్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు బీరవోలు సోమిరెడ్డి సూచనల మేరకు శుక్రవారం మండలంలోని అడివెంల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ,నిర్మాణం పనులను లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నిరుపేద కుటుంబం ఇంటిని నిర్మించుకునేందుకు రూ.5 లక్షలను ప్రభుత్వమే సమకూరుస్తుందని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు.