26-09-2025 07:43:14 PM
కమానపూర్ కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు రేబల్ రాజ్ కుమార్
కమాన్‌పూర్,(విజయక్రాంతి): ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వీధి దీపాల ఏర్పాటు చేశామని కమానపూర్ కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు రేబల్ రాజ్ కుమార్ అన్నారు. రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ దుద్దిళ్ల శ్రీను బాబు ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ సహకారంతో జూలపల్లి గ్రామ ప్రజల అభ్యర్థనను నెరవేర్చుతూ రెబల్ రాజ్‌కుమార్ గ్రామపంచాయతీ కార్యదర్శికి 30 వాట్స్ సామర్థ్యం గల 25 ఎల్ఈడి వీధి దీపాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు రెబల్ రాజ్ కుమార్ మాట్లాడుతూ... గ్రామంలో వెలుతురు సమస్యలు తొలగి ప్రజలకు రాత్రి వేళల్లో భద్రత, సౌకర్యం కలుగుతుందని, పిల్లలు, విద్యార్థులు, మహిళలు సురక్షితంగా సంచరించేందుకు ఇది ఉపయోగపడుతుందని, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. అలాగే ప్రజల అభ్యున్నతి కోసం మంత్రి శ్రీధర్ బాబు, జనరల్ సెక్రటరీ శ్రీను బాబు ఎల్లప్పుడూ కృషి చేస్తూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అన్నారు.