1 March, 2026 | 5:30 AM

విజ్ఞాన్స్‌లో ఆకట్టుకున్న జెనెక్స్-2026

01-03-2026 12:02 AM

దేశుముఖిలోని యూనివర్సిటీలో జాతీయ సైన్స్ దినోత్సవం   

హైదరాబాద్, ఫిబ్రవరి 28(విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా, భూదాన్ పోచంపల్లి మండలం, దేశుముఖిలోని విజ్ఞా న్స్ యూనివర్సిటీలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ‘జెనెక్స్- 2026’ పేరుతో విజ్ఞాన ప్రదర్శనను ఏర్పా టు చేశారు.

బయో టెక్నాలజీ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎక్స్‌పోలో శాస్త్ర సాంకేతిక అంశాలకు సంబంధించి వి ద్యార్థులు తయారుచేసిన ప్రాజెక్టు నమూనాలు ఆకట్టుకున్నాయి.విద్యార్థులు తమ సృ జనాత్మకతతో సరికొత్త ఆవిష్కరణలను ప్రదర్శించి సందర్శకుల ప్రశంసలు అందుకు న్నారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీయడంలో ‘జెనెక్స్-2026’ వేదికగా నిలిచిందని అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేసింది.

నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి: డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వర రావు 

విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వర రావు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు కేవ లం చదువుకే పరిమితం కాకుండా ఇలాంటి సాంకేతిక ప్రదర్శనల ద్వారా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా బయోటెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులను అవగాహన చేసుకోవాలని ఆయన వి ద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. కాగా ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక వేడుకలు ఆహుతులను అలరించాయి. కార్యక్ర మంలో ఆయా విభాగాల డీన్లు, డైరెక్టర్లు, హెచ్‌ఓడీలు, అధ్యాపక బృందం, విద్యార్థు లు, సిబ్బంది పాల్గొన్నారు.