ఏఎంఎస్ స్కూల్‌లో ఆర్థిక విశ్లేషణపై వర్క్‌షాప్
హైదరాబాద్, ఫిబ్రవరి 28(విజయక్రాంతి): ఏఎంఎస్ స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మాటిక్స్ తమ ఫైనాన్స్ క్లబ్ క్రెడిట్ క్రుంచర్స్ ఆధ్వర్యం లో శనివారం ఏఎంఎస్‌ఎస్‌ఓఐ సెమినార్ హాల్‌లో ఆర్థిక విశ్లేషణ అండ్ ఫైనాన్స్ నా యకుల పాత్రపై వర్క్‌షాప్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఈ సెషన్స్‌ను బేకిం ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఎఫ్‌ఓ డాక్టర్ కిషోర్ నూతలపాటి నిర్వహించారు. ఆయన ఆర్థిక విశ్లేషణ, వ్యూహాత్మక నిర్ణయా లు, నేటి కార్పొరేట్ ప్రపంచంలో ఫైనాన్స్ నాయకుల అభివృద్ధి చెందుతున్న పాత్రపై విలువైన పరిశ్రమ దృక్కోణాలను పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యా ర్థులను ౮ బృందాలుగా విభజించి సీఎఫ్‌ఓస్ నుంచి ట్రేడర్ ఈక్విటీ ఇన్వెస్టర్, షేర్ హో ల్డర్స్, క్రెడిట్ ఏజెన్సీ.. ఇలా విభిన్న పాత్రలను అప్పగించారు. ఈ అనుకరణ ద్వారా విద్యార్థులు ఆర్థిక పరిస్థితులను విశ్లేషించి, వ్యూహాలను చర్చించి, ప్రమాదాలను మూ ల్యాంకనం చేసి, డేటా ఆధారిత నిర్ణయాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఐఆర్ కల్యాణి సమన్వయంతో నిర్వహించారు. వైస్ చైర్‌పర్సన్ డాక్టర్ ఎస్.శ్రీదేవి, కార్యదర్శి కార్యదర్శి జేఎస్ సుధాకరు డు, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ పి. వేణుప్రియ తదితరులున్నారు.




