calender_icon.png 23 August, 2025 | 9:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సమస్యలపైనే మా పోరాటం

23-08-2025 05:48:34 PM

బిజెపి మండల అధ్యక్షుడు క్రాంతి.

హాజరైన రాష్ట్ర నాయకుడు  రవీందర్.

హామీలు నెరవేర్చని గత ప్రభుత్వం.

డిగ్రీ కళాశాల, 30 పడకల ఆసుపత్రి వెంటనే మంజూరు చేయాలి

ముస్తాబాద్ (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) ముస్తాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల అలాగే 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి మంజూరు విషయమై మాట తప్పిన గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వంపై నిరసన చేపట్టడం జరిగింది. వివేకానంద విగ్రహం వద్ద నుండి తాహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిరిసిల్ల మున్సిపల్ మాజీ చైర్మన్ రాష్ట్ర బిజెపి నాయకులు ఆడెపు రవీందర్ హాజరయ్యారు. అనంతరం బిజెపి మండల అధ్యక్షుడు సౌళ్ళ క్రాంతి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి డిప్యూటీ తాహసిల్దార్ అపర్ణకు స్థానిక సమస్యలపై వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్బంగా నాయకులు రవీందర్, క్రాంతి మాట్లాడుతూ, గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, 30 పడకల ఆసుపత్రి మంజూరు చేస్తామని మాట ఇచ్చి పది 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మంజూరు చేయకుండా కాలయాపన చేసిందని పేర్కొన్నారు. ముస్తాబాద్ పెద్ద చెరువును పర్యటక కేంద్రంగా మారుస్తామని మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేశారన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే డిగ్రీ కళాశాల,30 పడకల ఆసుపత్రిని మంజూరు చేయాలని బిజెపి పక్షాన డిమాండ్ చేస్తున్నామని వెల్లడించారు. అలాగే ముస్తాబాద్ పెద్ద చెరువును పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో నిర్మించిన ఆరోగ్య కేంద్రాన్ని ఊరు మధ్యలో ఉన్న వెంకటేశ్వర ఆలయం వద్ద గ్రామపంచాయతీ చావడికి మార్చి ప్రజలకు అందుబాటులోకి తేవాలని సూచించారు.

పంచాయతీ పరిధిలో ఎక్కడపడితే అక్కడ తవ్విన గుంతలు వెంటనే పూడ్చాలని కోరారు. పారిశుద్ధంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. నిరుపయోగంగా ఉన్న వైకుంఠ రతాన్ని బాగు చేసి అందుబాటులోకి తేవాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బిజెపి పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు వినతి పత్రంలో పేర్కొనడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గోపికృష్ణ,పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సంతోష్ రెడ్డి, సిరిసిల్ల నియోజకవర్గ కన్వీనర్ మల్లారెడ్డి,నాయకులు సంజీవ్,శ్రీకాంత్, శ్రీనివాసరావు,కార్తీక్ రెడ్డి, బాద నరేష్,శంకర్,రమేష్ రెడ్డి,వెంకటేష్ రెడ్డి,పద్మ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.