3 April, 2026 | 2:30 PM

Breaking News

TRS పేరుతో కవిత పార్టీ..! పాత పేరు.. కొత్త అజెండాతో ప్రజల ముందుకు   •   మంగళపల్లిలో ‘నత్తనడక’న అభివృద్ధి పనులు   •   మహంకాళి అమ్మవారికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రత్యేక పూజలు   •   ఘనంగా దొడ్డి కొమురయ్య 99వ జయంతి వేడుకలు   •   రైలు ఢీకొని గుర్తు తెలియని వృద్ధురాలు మృతి   •   కొండాపూర్‌లో డ్రగ్స్ కలకలం.. పబ్‌లో సినీనటి హేమ   •   బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ — అమ్మవారి జాతరకు వెళ్లొస్తూ ముగ్గురు దుర్మరణం   •   తూప్రాన్‌లో శ్రీరాముడి రథోత్సవం.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య వివాదం   •   దొడ్డి కొమరయ్య... నేటి ప్రజావ్యతిరేక పోరాటలకు స్పూర్తి: కేసీఆర్   •   బహుజన ఆత్మగౌరవ ప్రతీక దొడ్డి కొమురయ్య   •  

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను సింగరేణిలో జయప్రదం చేయాలి

10-02-2026 01:49 PM

ఎఐటీయుసీ  బెల్లంపల్లి రీజియన్ ప్రెసిడెంట్ బోగే ఉపేందర్

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేసి, ఇప్పటి వరకు అమలులో ఉన్న 44 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని ఎఐటీయుసీ బెల్లంపల్లి రీజియన్ ప్రెసిడెంట్ బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం గోలేటిలో డ్రైవర్లు, క్లీనర్లతో కలిసి సమ్మె వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా బోగే ఉపేందర్ మాట్లాడుతూ సింగరేణిలో నూతన బొగ్గు బావులు తవ్వాలని, బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని కోరారు.

అలాగే కనీస వేతనంగా రూ.26,000 నిర్ణయించాలని, 12 గంటల పనివిధానాన్ని, హిట్ అండ్ రన్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షక ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. విదేశీ పెట్టుబడులను వెంటనే ఉపసంహరించుకోవాలని, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించి సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మికులు శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, వెంకటేష్, కుమార్, సత్యనారాయణతో పాటు పలువురు పాల్గొన్నారు.