02-12-2024 12:00:00 AM
నోయిడా: దబంగ్ ఢిల్లీ కేసీ 32 తేడాతో తమిళ్ తలైవాస్ మీద విజయం సాధించింది. ఈ సీజన్‌లో పెద్దగా రాణించకుండా సైలెంట్‌గా ఉంటున్న ఢిల్లీ స్టార్ ప్లేయర్ నవీన్ కుమార్ ఈ మ్యాచ్‌లో సూపర్ టెన్‌తో చెలరేగాడు. నవీన్ కుమార్‌కు తోడుగా కెప్టెన్ అషూ మాలిక్ కూడా 5 పాయింట్లు సాధించడంతో ఢిల్లీ గెలుపు సులువయింది.
ఫస్టాఫ్ హోరాహోరీగా సాగిన మ్యాచ్ సెకండాఫ్‌కి వచ్చేసరికి దబంగ్ ఢిల్లీవైపు మళ్లింది. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 38 తేడాతో బెంగాల్ వారియర్జ్ మీద విజయం సాధించింది. పట్నాలో దేవాంక్ మరోసారి సూపర్ టెన్ సాధించాడు. తొలుత రెండు జట్లు నువ్వా అన్నట్లు తలపడినా కానీ చివరికి వచ్చే సరికి పట్నాను విజయం వరించింది. దేవాంక్‌కు తోడు అయాన్ కూడా సక్సెస్ అయ్యాడు. స్టార్ డిఫెండర్ ఫజల్ ఉన్నా కానీ బెంగాల్ సత్తా చాటలేకపోయింది.