calender_icon.png 14 September, 2025 | 5:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ సారీ డ్రానే

02-12-2024 12:00:00 AM

వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్

సింగపూర్: వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భాగంగా గుకేశ్, డింగ్ లిరెన్ మధ్య జరిగిన ఆరో గేమ్ డ్రాగా ముగిసింది. ఈ డ్రా తర్వాత ఇరువురు ఆటగాళ్లు 3 పాయింట్లతో నిలిచారు. 14 రౌండ్లలో ఏ ఆటగాడు మొదట 7.5 పాయింట్లు సాధిస్తాడో వారినే చాంపియన్‌షిప్ వరిస్తుంది. ఇప్పటి వరకు ఆరు రౌండ్లు జరగ్గా 4 రౌండ్లు డ్రాగానే ముగిశాయి. గుకేశ్ నల్లపావులతో ఆడగా..46 ఎత్తుల తర్వాత ఇరువురు ఆటగాళ్లు డ్రాకు అంగీకరించారు.