calender_icon.png 24 September, 2025 | 7:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వచ్ఛత హి సేవపై కళాజాత ప్రదర్శన

24-09-2025 05:05:12 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని సలుగుపల్లి గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో స్వచ్ఛత హి సేవపై కళాజాత ప్రదర్శన కార్యక్రమం నిర్వహించినట్లు గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సత్య కిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... స్వచ్ఛత హి సేవ, డెంగీ, జ్వరాలు, జాగ్రతలు, తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ప్రమాద బీమాపై, పెన్షన్, తదితర పథకాలపై కళాజాత బృందం మ్యాజిక్ షో ద్వారా ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించారు.

ప్రధానమంత్రి పాలసీలపై వివరించారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో బీమా కుటుంబానికి ధీమాని తెలిపారు. సైబర్ మోసాల పట్ల ఖాతాదారులకు అర్థమయ్యే విధంగా తెలిపారు. గ్రామంలో పరిశుభ్రత పాటిస్తేనే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. గ్రామీణ బ్యాంకులో ఆధార్ కేవైసీ చేసుకొని ఖాతాదారులు బ్యాంకుకు వచ్చి నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐకెపి సిసి భద్రయ్య,కళాజాత బృందం సభ్యులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.