calender_icon.png 24 September, 2025 | 8:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల సమగ్రాభివృద్ధికి పెద్దపీట

24-09-2025 05:14:49 PM

పటాన్ చెరు: తరగతి గదిలోనే కాకుండా, ఇతరత్రా కార్యకలాపాలలో కూడా చురుకుగా పాల్గొనడం ద్వారా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిని పెంపొందించడానికి గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం బుధవారం ప్రత్యేకంగా కొంత సమయాన్ని కేటాయించింది. సాంకేతికత, స్థిరత్వం, చర్చ, సామాజిక సేవ, సృజనాత్మక వ్యక్తీకరణ వంటి విభిన్న కార్యక్రమాలతో ప్రాంగణం సజీవంగా మారింది. ఈఈసీఈ విద్యార్థులకు రోబోటిక్స్ 2.0 కార్యశాలతో పాటు, జీ-ఎలక్ట్రా(స్మార్ట్ సిస్టమ్స్ క్లబ్) కొత్త సభ్యుల నియామకాన్ని ప్రారంభించారు. విశ్వవిద్యాలయం యొక్క హరిత నిబద్ధతను బలోపేతం చేస్తూ, చరైవేతి విద్యార్థి విభాగం టాలెంట్ కేఫ్ వెనుక మొక్కలు నాటింది. 

మేధోపరమైన చర్చలను కొనసాగించే లక్ష్యంతో డిబేట్ సొసైటీ HYLE-7 పేరిట డిబేట్ టోర్నమెంటును నిర్వహించింది. జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) దినోత్సవంలో భాగంగా, కొత్తగా చేరిన వాలంటీర్లను స్వాగతించారు. సృజనాత్మకత, కెరీర్ సంసిద్ధత కోసం శిక్షణ, సామర్థ్య అభివృద్ధి చొరవ (టీఎఫ్ సీ) విద్యార్థులను వాస్తవ ప్రపంచ నైపుణ్యాలతో సన్నద్ధం చేయడం ద్వారా విద్య-పరిశ్రమల మధ్య వారధిని నిర్మించడానికి రూపొందించిన బియాండ్ నంబర్స్ లఘు చిత్రాన్ని ప్రదర్శించింది. బీటెక్ లో మేజర్, మైనర్ సబ్జెక్టులను ఎంపిక చేసుకోవడంపై నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థులకు అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆవిష్కరణ, సేవ, వ్యక్తిగత వృద్ధి ద్వారా గీతం హైదరాబాదు విద్యార్థులను భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న నిపుణులుగా, బాధ్యతాయుత పౌరులుగా పెంపొందించడానికి తన నిబద్ధతను మరోసారి పునరుద్ఘాటించింది.