calender_icon.png 18 November, 2025 | 10:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాయకపోడు సంగీతం

24-07-2024 12:00:00 AM

వీరిని నాయకులు, పాండవుల వారు, పద్మ నాయకులు, నాయకపోడులు అని పిలుస్తారు. వీరు గోదావరి పరివా హక ప్రాంతం కేంద్రంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, ఒరిస్సాలలో వ్యాపిం చి ఉన్నారు. వీరు లక్ష్మీదేవర పండుగను ఘనంగా చేస్తారు. సంగీత వాద్యాలతో లక్ష్మీదేవరలను తోడుకు వస్తారు. రుంజవంటి చర్మవాద్యాన్ని వాయిస్తారు. ఇది నాలుగు అడుగులు పొడవు ఉంటుంది. డప్పులు, తాళాలు, పిల్లంగోయి వంటి వాద్యాలు ఉంటాయి. 

వీరి సంస్కృతిలో ప్రత్యేకంగా చిత్రకళలో భాగమైన ముఖ తొడుగులు ముఖ్యమైనవి. మెతక రంగురాళ్లు, చెట్ల కాయలు, పూల నుంచి ఇరుగుల నుంచి రంగులను తయారు చేస్తారు. బరువులేని పునికి, బూరుగు కర్రపై పాండవుల ముఖ తొడుగులను చిత్రిస్తారు. కొలుపులు, దేవరలు జరిపే సంబరాలలో వీటిని ధరిస్తారు. 

చాలామంది దేవుళ్ళను ఒకే చోట చేర్చి చేసే కొలువుల సందర్భంగా సంగీతం చోటు చేసుకుంటుంది. ఈ సందర్భంగా చేసే నృత్యాలకు అనుగుణంగా వాద్యాలు వాయిస్తారు. డోలు, సన్నాయి, శ్రుతి వాడకం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ప్రధానంగా కనిపిస్తుంది. ఈ గూడేలలోని నగుర్లు ఇల్లార్లలో దేవతలను, కొలిచేటప్పుడు వాడే వాయిద్య పరికరాలను స్వంతంగానే తయారుచేసి ఉపయోగిస్తారు.