calender_icon.png 31 August, 2025 | 12:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేజీబీవీల్లో నీట్, జేఈఈ కోచింగ్

31-08-2025 12:26:48 AM

  1. గురుకులాల తరహాలో ఉచిత శిక్షణ
  2. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళిక
  3. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు

హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాం): కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల(కేజీబీవీ)ల్లోని ఇంటర్ విద్యార్థులు జేఈఈ, నీట్‌లో ఉత్తమ ఫలితాలను రాబట్టేందుకు వీలుగా పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. ఈ విద్యాలయా ల్లో ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 495 కేజీబీవీలున్నాయి. అయితే వీటిలో ఇంటర్ విద్య అందుబాటు లో ఉన్న కేజీబీవీల్లో ఉచితంగా  నీట్, జేఈ ఈ, ఎప్‌సెట్ కోచింగ్‌తోపాటు మెటీరియల్‌ను కూడా ఇవ్వాలని నిర్ణయించారు.

ఈ విద్యాసంవత్సరం నుంచే దీన్ని అమలు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తొలుత జిల్లాకు రెండు నుంచి మూడు విద్యాలయాలను ఎంపిక చేశారు. దాదాపు 93 కేజీబీవీల్లో ఈ విద్యాసంవత్సరం నుంచి కోచింగ్‌ను ప్రారంభించనున్నారు. తొలుత మోడల్ స్కూళ్లలోనూ ఫ్రీ కోచింగ్‌ను విద్యార్థులకు ఇవ్వాలని భావించారు.

కానీ ఈ విద్యాసంవత్సరం నుంచి కేజీబీవీలకే దీన్ని పరిమితం చేస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. సాంఘిక సంక్షేమ గురుకులాల తరహాలో కేజీబీవీల్లోనూ కోచింగ్‌ను ఇచ్చి నీట్, జేఈఈ, ఎప్‌సెట్ లాంటి ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను రాబట్టాలని ఈ నిర్ణయం తీసుకున్నారు.