calender_icon.png 8 July, 2025 | 5:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిఘా నేత్రాలపై నిర్లక్ష్యం!

08-07-2025 01:27:49 AM

పనిచేయని సీసీ కెమెరాలు

బెజ్జంకి జూలై 7: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. దాంతో అవి మరమ్మతులు నోచుకోకపోవడం వల్ల అవసరానికి ఉపయోగపడటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.  ఇదివరకు బెజ్జంకి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలోని ప్రధాన కూడలిలో, రహదారుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

దాంతో గ్రామాలలో అవాంఛనీయ ఘటనలు జరిగినా పోలీసులు సులభంగా ఛేదించగలరు. ఇలా ప్రస్తుత జీవన గమనంలో ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. అటువంటి నిఘా నేత్రాలు  బెజ్జంకి మండల కేంద్రం అంబేద్కర్ కూడాలి లో పని చేయటం లేదు. నిత్యం రద్దీగా ఉండే అంబేద్కర్ కూడలిలో నాలుగు వైపులా వాహనాలు, ప్రయాణికులతో రద్దీగా ఉంటాయి.

వాహనాల నెంబరు ప్లేట్లను పోలీస్  స్టేషన్ లో కూర్చుని చూసేంత సీసీ కెమెరాల వ్యవస్థను అప్పటి పోలీసు అధికారుల పర్యవేక్షణలో ఈ సాంకేతికతను ఏర్పాటు చేశారు. ఇదే కాదు గతంలో ఓక దొంగల ముఠా బెజ్జంకి మండల పరిధిలోని రేగులపల్లి, ఇతర గ్రామాలలో మేకలు దొంగలించి తీసుకెళ్లే ముఠాను గాగిల్లాపూర్ లో అప్పటి ఎస్‌ఐ అభిలాష్ సీసీ కెమెరాల ద్వారా గుర్తించి వారిని పట్టు కోవటం  జరిగింది.

ఎన్నో దొంగతనం కేసులు దర్యాప్తులో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషించాయి. అలాంటి నిఘా కెమెరాలు ఇపుడు మొండి కేశాయి. మండల పరిధిలోని అన్ని గ్రామాలలలో ఎక్కడో ఒక చోట మాత్రమే సీసీ కెమెరాలు వున్నవి.

వున్న చోట పనీయటం లేదు. పర్యవేక్షణ లోపం కారణంగా సగానికి పైగా మూలనపడ్డాయి. బెజ్జంకి పోలీసు స్టేషన్ గతంలో సీసీ కెమెరాల వినియోగంలో అందరి ప్రశంసలు అందుకుంది. సాంకేతికతతో పోటీపడి జాతీయ స్థాయిలో  అవార్డులు అందుకుంది. అదే శాఖ ఇపుడు పర్యవేక్షణ లోపం వల్ల కెమెరాలు పని చేయడం లేదు.

మరమ్మతులు చేయిస్తాం.. 

పనిచేయని సీసీ కెమెరాలు నువ్వు గుర్తించి మరమ్మతులు చేపిస్తాం పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో సీసీ కెమెరాలు ఉండే విధంగా చర్యలు చేపడతారు స్వచ్ఛంద సంస్థలు గ్రామ పెద్దలు వారి గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు తమ వంతు సహకారం అందించే విధంగా కృషి చేస్తాం ప్రస్తుత పరిస్థితులలో సీసీ కెమెరాలు అవసరం ముఖ్యమైనదిగా భావిస్తున్నాం.                                                        

              తిరుపతి రెడ్డి, ఎస్‌ఐ, బెజ్జంకి