07-11-2025 06:25:18 PM
హన్మకొండ,(విజయక్రాంతి): మెడికవర్ హాస్పిటల్ వరంగల్ వైద్య బృందం మరోసారి అత్యాధునిక న్యూరో సర్జరీలో గొప్ప విజయాన్ని సాధించింది. 52 ఏళ్ల మహిళా వరలక్ష్మి కి ఎడమ ముందు మెదడు ధమనిbలో ఏర్పడిన పగిలిన అన్యూరిజం కారణంగా వచ్చిన సబ్-అపక్‌నాయిడ్ హీమరేజ్ తో అత్యవసర పరిస్థితిలో 12 అక్టోబర్ 2025న ఆసుపత్రికి తీసుకువచ్చారు. రోగి పరిస్థితిని అత్యవసరంగా పరిశీలించిన న్యూరో సర్జరీ విభాగం, డా.టి. సంజయ్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్ నేతృత్వంలో 13 అక్టోబర్ 2025 న క్రానియోటమీ తో అన్యూరిజం క్లిప్పింగ్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ శస్త్రచికిత్సలో డా. సంజయ్‌కు తోపాటు డా. యూనీస్, డా. కిషోర్, అనస్థీషియా నిపుణుడు డా. వాసు ప్రకాష్, క్రిటికల్ కేర్ ఇన్‌చార్జ్ డా. లక్ష్మీ దీపక్ పనిచేశారు.శస్త్రచికిత్స అనంతరం రోగి పూర్తిగా కోలుకుని, ఎటువంటి న్యూరోలాజికల్ లోపాలు లేకుండా సాధారణ ఆహారం తీసుకుంటూ పూర్తిస్థాయి కదలికలతో 25 అక్టోబర్ 2025న డిశ్చార్జ్ అయ్యారు.
ఈ సందర్భంగా డా.టి.సంజయ్ మాట్లాడుతూ.... ప్రపంచ జనాభాలో సుమారు 3.5% మందిలో మస్తిష్క అన్యూరిజంలు కనిపిస్తాయి.ఇవి చాలా అరుదైన మరియు అత్యంత ప్రమాదకరమైన కేసులు. సమయానికి గుర్తించడం మరియు వెంటనే శస్త్రచికిత్స చేయడం ప్రాణాపాయ పునరావృత రక్తస్రావాన్ని నివారించడంలో కీలకం అని తెలిపారు. మెడికవర్ హాస్పిటల్ వరంగల్ సెంటర్ హెడ్ నమ్రత మాట్లాడుతూ ఇలాంటి అత్యంత క్లిష్ట న్యూరో సర్జరీలను విజయవంతంగా నిర్వహించడం మా వైద్య బృందం నైపుణ్యానికి నిదర్శనం. వరంగల్ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ప్రపంచస్థాయి న్యూరోసర్జరీ మరియు క్రిటికల్ కేర్ సేవలు అందించడానికి మేం కట్టుబడి ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో పిఆర్ఓ రాజేశ్వర్ రెడ్డి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.