07-11-2025 06:22:50 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బంకించంద్రచటోపాధ్యాయ వందేమాతరం గీతం రచించి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు వందేమాతరం గీతం ఆలపించడం జరిగింది , ఈ కార్యక్రమంలో మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ వందేమాతరం అనేది ఒక నినాదమే కాదు ఇది ఒక మంత్రం అని అన్నారు, ఈ వందేమాతరం నినాదంతో ఎందరో మహానుభావులు స్వాతంత్ర పోరాటం చేసి చరిత్రలో చిరస్మరణీయులయ్యారు అని అన్నారు,