calender_icon.png 18 October, 2025 | 10:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుజరాత్‌లో కొలువుదీరిన కొత్త మంత్రివర్గం

18-10-2025 12:40:50 AM

-26 మందితో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ దేవవ్రత్

-క్యాబినెట్‌లో క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబాకు చోటు

గాంధీనగర్, అక్టోబర్ 17: గుజరాత్‌లో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మి గతా మంత్రులంతా రాజీనామా చేయడం తో శుక్రవారం కొత్త మంత్రివర్గం కొలువుదీరింది.రాష్ట్ర రాజధాని గాంధీనగర్‌లో శుక్ర వారం 26 మందితో కూడిన మంత్రివర్గం తో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రమాణ స్వీకా రం చేయించారు. హోంమంత్రిగా హ ర్ష్ రమేశ్‌భాయ్ సంఘవీ, డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించా రు. క్యాబినె ట్ కూర్పులో బీజేపీ అధిష్ఠానం సామాజిక సమతుల్యత కు పాటించింది.

మంత్రివర్గంలో ఏడుగురు పాటిదార్లు, ఎనిమిది మంది ఓబీసీలు, ముగ్గురు ఎస్సీ లు, నలుగురు ఎస్టీలకు అవకా శం కల్పించింది. మంత్రుల్లో ము గ్గు రు మహిళలు. వీరిలో ఎక్కువ మంది కొ త్తవారే కావడం విశేషం. గత క్యాబినెట్‌లో ఉన్న మంత్రుల్లో కేవలం ఆరుగురు మాత్ర మే తిరిగి పదవులు చేపట్టారు. క్రికెటర్ రవీం ద్ర జడేజా భార్య, జామ్‌నగర్ నార్త్ ఎమ్మె ల్యే రివాబా జడేజా కూడా మంత్రివర్గంలో చోటు దక్కింది. వ్యవస్థాగత, రాజకీయ సవాళ్లను ఎదుర్కొనే లక్ష్యంతో రాష్ట్ర క్యాబినెట్‌ను పునఃవ్యవస్థీకరించాలనే ప్రణాళికలో భాగం గా రాజీనామా ప్రక్రియ చోటుచేసుకున్నట్లు బీజేపీప్రకటించింది. 

రివాబా నేపథ్యం..

1990లో రాజ్‌కోట్‌లో జ న్మించిన రివాబా ఆత్మియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సెన్సైస్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశా రు. 2016 ఏప్రిల్ 17న భారత క్రికెటర్ రవీంద్ర జడేజాను వివాహం చేసుకున్నారు. 2019లో ఆమె బీజేపీలో చేరారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె జామ్‌నగర్ నార్త్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.  ఆమె బీజేపీలో చేరకముందు 2018లో కర్ణిసేన అనే సంస్థ మహిళా విభాగానికి చీఫ్‌గా వ్యవహరించారు.