18-10-2025 12:43:26 AM
-పుతిన్‌తో ట్రంప్ ఫోన్ సంభాషణ
-ప్రతిపాదనపై పుతిన్ నుంచి వ్యతిరేకత వచ్చిందని ట్రంప్ స్పష్టీకరణ
వాషింగ్టన్, అక్టోబర్ 17: ఉక్రెయిన్ రష్యా మధ్య కొనసాగుతున్న యుద్ధం ము గించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పే అంశంపై రష్యా అధ్య క్షుడు పుతిన్‌ను బతిమాలో, భయపెట్టో ఒ ప్పించాలని సమయం కోసం వేచిచూస్తున్నా రు. తాజాగా ఉక్రెయిన్‌కు 2 వేల దీర్ఘశ్రేణి తోమహాక్ క్షిపణులు అందజేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయంపై తాను రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌కాల్‌లో సం భాషించినట్లు తాజాగా మీడియాకు వెల్లడించారు.
‘ఉక్రెయిన్‌కు తోమహాక్ క్షిపణులు అందించొద్దని పుతిన్ మిమ్మల్ని కోరారా?’ అని ఒక మీడియా ప్రతినిధి ట్రంప్‌ను ప్రశ్నించగా, ‘ఉక్రెయిన్‌కు దయచేసి తోమహాక్ క్షిపణులు ఇవ్వండి. అలా చేస్తే నేను అభినం దిస్తానని పుతిన్ అంటాడని, మీరు అనుకుంటున్నారా?’ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరా రు. ‘మీ ప్రత్యర్థికి 2 వేల తోమహాక్ క్షిపణులు ఇస్తే మీకు అభ్యంతరం ఉంటుందా? అని తా ను పుతిన్‌ను ప్రశ్నించాను’ అని తెలిపారు. ఆ ప్రశ్నతో పుతిన్ నుంచి బలమైన వ్యతిరేకత వ్యక్తమైందని స్పష్టం చేశారు.
మరోవైపు ట్రం ప్‌తో ఫోన్‌కాల్‌లో తోమహాక్ క్షిపణుల గు రించి పుతిన్ మాట్లాడారని క్రెమ్లిన్ ప్రతినిధి యూరి ఉషాకోవ్ ధ్రువీకరించారు. ఒకవేళ ఉక్రెయిన్‌కు ఆ క్షిపణులు అందిస్తే, అమెరి కా,రష్యా మధ్య సంబంధాలు దెబ్బతింటా యని పుతిన్ హెచ్చరించినట్లు తెలిపారు. మరికొద్దిరోజుల్లో ట్రంప్ హంగరీ రాజధాని బుడాపెస్ట్‌లో పుతిన్‌తో భేటీ కానున్నారని, దాంతోనైనా రష్యా, ఉక్రెయిన్ మధ్య యు ద్ధం ముగింపునకు అడుగులు పడితే బా గుంటుందని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం.