09-08-2025 12:00:00 AM
ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల అర్బన్, ఆగస్టు 8 (విజయ క్రాంతి): జగిత్యాల జిల్లా కేంద్రంలో రు.203 కోట్ల నిధులతో నూతన ఆసుపత్రి మంజూరు అయినట్లు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. జగిత్యాల మోతే పార్టీ కార్యాలయం లో జగిత్యాల పట్టణం,రూరల్,అర్బన్ మండలాలకు చెందిన 88 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రు.36 లక్షల 66వేలు విలువగల చెక్కులను పంపిణీ శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూసేవ ద్వారానే తనకు రాజకీయాలలో గుర్తింపు వచ్చిందన్నారు.ఆపదలో ఉన్న వారికి సీఎం సహాయ నిధి ద్వారా అందించే ఆర్థిక సాయం ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. చెక్కులు. జగిత్యాల కు మెడికల్ కాలేజీ మంజూరు చేసుకొని రాష్ట్రములోనే మొదటి అనుమతి జగిత్యాల కు తీసుకురావడం జరిగిందన్నారు.తెలంగాణ రాష్ట్రంలో అత్యదిక పల్లె దవాఖానాలు జగిత్యాల నియోజకవర్గానికి మంజూరు చేయటం జరిగిందన్నారు.
రు.20కోట్ల నిధులు మెడికల్ కాలేజీ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంజూరు చేశారన్నారు.జగిత్యాల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి ,వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కి జగిత్యాల ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.కొత్త రేషన్ కార్డులు మంజూరు తో ప్రజలకు ఆహార భద్రతతో పాటు సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు తో సొంతింటి కల సాకారం కానుందని,నూకపల్లి లో అసంపూర్తి గా ఉన్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నిధులు మంజూరు తో నిరుపేదలకు లబ్ది చేకూరుతుందన్నారు. అభివృద్ది విషయంలో అందరూ కలిసి పనిచేయాలని,అభివృద్ధికి అడ్డు పడితే ప్రజలు క్షమించరన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, మాజీ ఏఎంసి ఛైర్మెన్ లు దామోదర్ రావు,నక్కల రాధ రవీందర్ రెడ్డి,బాలే శంకర్,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, దుమాల రాజ్ కుమార్,తాజా మాజీ కౌన్సిలర్ లు,సర్పంచ్ లు, నాయకులుపాల్గొన్నారు.