calender_icon.png 9 August, 2025 | 6:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్తగూడ ఏజెన్సీలో పులి సంచారం

09-08-2025 12:00:00 AM

ఆవుపై దాడి చేసిన ఘటన గుర్తింపు 

మహబూబాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన కొత్తగూడ అడవిలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. వారం రోజుల క్రితం కొత్తగూడ ఏజెన్సీలోని రాంపూర్ అటవీ ప్రాంతంలో ఆవును చంపినట్లు గుర్తించారు. శుక్రవారం ఆవు చనిపోయిన ఘటన స్థలికి చేరుకున్న ఫారెస్ట్, వెటర్నరీ శాఖల అధికారులు పంచనామా నిర్వహించారు. పాదముద్రల ఆధారంగా పెద్దపులే సంచరించినట్లు నిర్ధారించారు.

ఇదే ప్రాంతంలో మరో పులి పాద ముద్రలు గుర్తించినట్లు తెలుస్తోంది. పులుల జాడ కనిపించిన ప్రదేశంలో వాటి సంచారాన్ని గుర్తించేందుకు అటవీ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని రాంపూర్, కోనాపూర్, ఓటాయి, కర్ణగండి గ్రామాలకు చెందిన వారు అడవుల్లోకి వెళ్ళవద్దని, ప్రజలు, పశువుల కాపర్లు రాత్రిపూట అడవిలోకి వెళ్లకూడదని కొత్తగూడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వజహత్ పేర్కొన్నారు.