09-08-2025 12:00:00 AM
కరీంనగర్ క్రైం, ఆగస్టు 8 (విజయక్రాంతి): వావిలాలపల్లి లోని సెయింట్ పాల్స్ హైస్కూల్లో రక్షాబంధన్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సంప్రదాయ వేషధారణలో పాల్గొని, రాఖీలు కట్టి సోదరసోదరీల బంధాన్ని గుర్తుచేసుకున్నారు.
చిన్నారులు రాఖీలతో పాటు తీపిపదార్థాలను పంచుకున్నారు. గురువులు రక్షాబంధన్ ప్రాముఖ్యతను వివరిస్తూ, ఈ పండుగ సోదరసోదరీల మధ్య ప్రేమ, పరస్పర రక్షణకు ప్రతీక అని తెలిపారు. ఈ వే డుకలో పాఠశాల చైర్మన్ రాజ్ కుమార్ ప్రధానోపాధ్యాయులు లీనా ప్రియదర్శిని ,ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగాపాల్గొన్నారు.