calender_icon.png 1 January, 2026 | 2:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్ కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగరేసి తీరుతాం

01-01-2026 01:00:15 AM

కేంద్ర మంత్రి బండి సంజయ్ 

కరీంనగర్, డిసెంబరు 31 (విజయక్రాంతి): రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ తోపాటు తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీల్లో కాషాయ జెండా ఎగరేయడమే బీజేపీ ముందున్న లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజ య్ కుమార్ అన్నారు. బుధవారం కరీంనగర్ లోని త్రిధా హోటల్‌లో కరీంనగర్ కార్పొరేషన్ తోపాటు హుజూరాబాద్, హుస్నాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీల్లోని పట్టణ, జోన్ల అధ్యక్షులు, ముఖ్య నాయకులతో ‘మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి కరీంనగర్ కార్పొరేషన్ మే యర్ పీఠాన్ని కైవసం చేసుకుని తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.

టిక్కెట్ల విషయంలో పైరవీలు, మొహమాటాలకు తావులేదని, సర్వే రిపోర్టుల ఆధారంగా గెలుపు గుర్రాలకే పార్టీ నాయకత్వం బీజేపీ టిక్కెట్లు కేటాయిస్తుందని స్పష్టం చేశారు. టిక్కెట్ల కోసం తనతోపాటు తన కుటుంబ సభ్యులకు ఫోన్లు కూడా చేయొద్దని, ఎవరైనా ఒత్తిడి తెస్తే వాళ్లకు వచ్చే టిక్కెట్లు కూడా రావని హెచ్చరించారు. టిక్కెట్ ఆశించడంలో తప్పు లేదని, గెలవలేని పరిస్థితి ఉన్న ప్పుడు అర్ధం చేసుకుని పార్టీ గెలుపు కోసం పనిచేయాలని సూ చించారు.

ఈసారి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎక్కు వ మంది నామినేటెడ్ పోస్టులు దక్కేలా క్రుషి చేస్తానని హామీ ఇచ్చారు. బ్లాక్ మెయిల్‌కు, బెదిరింపులకు బండి సంజయ్ లొంగే రకం కాదని స్పష్టం చేశారు. ఈ స మావేశంలో జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, మాజీ అధ్యక్షులు బాస సత్యనారా య ణ, మాజీ మేయర్లు సునీల్ రావు, డి.శంకర్, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, వాసాల రమేశ్, రాజేంద్రప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

బెంగాల్ తర్వాత తెలంగాణే లక్ష్యం

బెంగాల్, తమిళనాడు ఎన్నికల తర్వాత బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి మొత్తం తెలంగాణపైనే సారించబోతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. ఈసారి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ గెలుపుతో ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ లక్ష్యాన్ని సంపూర్ణం చేస్తామని చెప్పారు. బుధవారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో బీజేపీ నాయకులను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడారు.

బీజేపీ కార్యకర్తల త్యాగాలు, పోరాటాలతో కమ్యూనిస్టు కంచుకోట కేరళ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయ ఢంకా మోగించిందన్నారు. బెంగాల్ లో బీజేపీ కార్యకర్తల ఇండ్లను ధ్వంసం చేస్తున్నా, మహిళా మోర్చా కార్యకర్తలపై అత్యాచారం చేసినా వెనకంజ వేయకుండా బెంగాల్ ప్రభుత్వంపై పోరాటాలు చేస్తూ వెన్నులో వణుకు పుట్టిస్తున్నారని చెప్పారు. హైకమాండ్ దృష్టి అంతా త్వరలోనే తెలంగాణలో కేంద్రీకృతం చేయబోతోందన్నారు.