12 గంటలకు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం
హైదరాబాద్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చాలా కాలంగా వాయిదా పడుతున్న తెలంగాణ కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ(Telangana Cabinet Expansion)కు ముహూర్తం ఖరారైంది. ఖాళీగా ఉన్న ఆరు స్థానాల్లో మూడు స్థానాలు భర్తీ అయ్యే అవకాశం ఉంది. ముందంజలో ఉన్న వారిలో తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన జి. వివేక్ వెంకట స్వామి(ఎస్సీ-మాల), అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (ఎస్సీ-మాదిగ), వాకిటి శ్రీహరి (బీసీ-ముదిరాజ్)లకు కొత్తగా మంత్రివర్గంలో చోటు దక్కింది. సామాజిక సమతుల్యత కోసం హైకమాండ్ లక్ష్యంగా పెట్టుకుందని పార్టీ అంతర్గత వర్గాలు తెలిపాయి.
నూతన మంత్రులగా ఎన్నికైన వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. వీరంతా ఆదివారం మధ్యాహ్నం 12.20 గంటలకు రాజ్ భవన్ లో కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం(Oath Taking) చేయనున్నారు. రామచంద్రనాయక్ కు శాసనసభ ఉపసభాపతిగా పదవీ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. మంత్రులుగా ప్రమాణం చేసే ముగ్గురికి, ఉపసభాపతిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న రామచంద్రనాయక్ కు టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు.






