calender_icon.png 10 September, 2025 | 8:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధీర వనిత చాకలి ఐలమ్మ..

10-09-2025 05:26:02 PM

భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి..

రేగొండ/భూపాలపల్లి (విజయక్రాంతి): ధీర వనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయకమని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి(Former MLA Gandra Venkataramana Reddy) అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకల్లో భాగంగా బుధవారం ఆయన భూపాలపల్లి సుభాష్ కాలనీలోని బస్టాండ్ సెంటర్లోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో భూస్వాములకు, పెత్తందారులకు, దేశ్ ముఖ్ లకు వ్యతిరేకంగా భూ పోరాటం చేసి బడుగు బలహీన వర్గాల వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ తెగువను చాటి చెప్పిన వీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. తన పోరాట స్ఫూర్తితో నిజాం నవాబులు, వారి తొత్తులైన భూస్వాములకు ఎదురొడ్డి నిలిచిన ఆ మహానీయురాలి స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.