10-09-2025 05:29:08 PM
తుంగతుర్తి (విజయక్రాంతి): తుంగతుర్తి రజక సంఘం అధ్యర్యంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు, భూమి కోసం బుక్తి కోసం వెట్టిచాకిరీ.. విముక్తి కోసం పోరాడిన బహుజన బతుకమ్మ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని రజక సంఘం నాయకులు కొనియాడారు. చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ట్యాంక్ బండ్ పైన చాకలి ఐలమ్మ విగ్రహన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలనీ వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.