calender_icon.png 5 January, 2026 | 11:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైల్వే అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

03-01-2026 03:54:15 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్( విజయక్రాంతి): బెల్లంపల్లి ఏరియా రైల్వే అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్  గోపి , రైల్వే ఎస్సై రాథోడ్ మోహన్ ని బెల్లంపల్లి రైల్వే స్టేషన్‌లో రెబ్బెన మండల ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్‌లో సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు నిలుపాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.స్పందించిన అధికారులు ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని  తెలిపారు.ఈ కార్యక్రమంలో రెబ్బెన మండల ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షుడు గోడిసెల వెంకటేశ్వర్ గౌడ్, ఉపాధ్యక్షులు రాజా గౌడ్, యూనియన్ నాయకులు శంకర్, విజయ్, సంతోష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.