03-01-2026 03:58:39 PM
కేసముద్రం, (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం పట్టణంలోని శ్రీ ధర్మశాస్త అయ్యప్ప దేవాలయంలో గురు స్వామి బోగోజు నాగేశ్వర చారి జన్మదినాన్ని పురస్కరించుకొని సందర్భంగా కేసముద్రంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరుముడి ధరించినందుకు ఆలయానికి వచ్చిన అయ్యప్ప మాలదారులతో పాటు వారి బంధువులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ బాధ్యులు పోలేపల్లి యాకూబ్ రెడ్డి, పొదిల నరసింహారెడ్డి, పెరుమాండ్ల ఎల్లగౌడ్, ఇనుగుర్తి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కూరెల్లి సతీష్, కేసముద్రం బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పునూతల రమేష్, గాంతి వెంకటరెడ్డి, చింతా కరుణాకర్, కొత్తపల్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.