05-01-2026 10:54:06 AM
మేరీల్యాండ్: అమెరికాలో తెలుగు యువతి(Telugu Girl) దారుణ హత్యకు గురైంది. డిసెంబర్ 31 నుంచి 27 ఏళ్ల యువతి నిఖిత గోడిశాల కనిపించకుండా పోయింది. మేరీల్యాండ్‌లోని కొలంబియాలో ఉన్న తన స్నేహితుడు అర్జున్ ఇంట్లో విగతజీవిగా లభించింది. హోవార్డ్ కౌంటీ పోలీసుల(Howard county police) ప్రకటన ప్రకారం, డిటెక్టివ్‌లు సోదాల వారెంట్‌ను అమలు చేసిన తర్వాత ఆమె తన స్నేహితుడు అర్జున్ శర్మ ఫ్లాట్‌లో నికిత కత్తిపోట్లు గాయాలతో కనిపించింది. అర్జున్ శర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రాథమిక విచారణలో నిఖిత డిసెంబర్ 31వ తేదీన అర్జున్ అపార్ట్‌మెంట్‌కు వెళ్లినట్లు వెల్లడైంది. ఆ తర్వాత ఆమె అతని అపార్ట్‌మెంట్ నుండి అదృశ్యమైనట్లు తెలిసింది. ట్విన్ రివర్స్ రోడ్‌లోని 10100 బ్లాక్‌లో ఉన్న తన నివాసంలో డిసెంబర్ 31న చివరిసారిగా ఆమెను చూశానని చెబుతూ, జనవరి 2వ తేదీన అతను నిఖిత అదృశ్యం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అర్జున్ శర్మ పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత అదే రోజు దేశం విడిచి పారిపోయినట్లు సమాచారం. అతను విమానంలో భారతదేశానికి తిరిగి వచ్చాడు. అతన్ని గుర్తించి అరెస్టు చేయడానికి హొవార్డ్ కౌంటీ పోలీసులు అమెరికాలోని ఫెడరల్ చట్ట అమలు సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు. నికితా గొడిషాల హెల్త్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ పూర్తి చేసి ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీలో డేటా అండ్ స్ట్రాటజీ అనలిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఆమె మేరీల్యాండ్ బాల్టిమోర్ విశ్వవిద్యాలయంలో చదువుకుంది. వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం గోడిశాల కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నామని, వారికి కాన్సులర్ సహాయం అందిస్తున్నామని తెలిపింది.