calender_icon.png 20 September, 2025 | 10:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిపిఐ జాతీయ మహాసభలకు తొమ్మిది మంది ప్రతినిధులు

20-09-2025 08:21:56 PM

కేంద్రపరిధిలోని జిల్లా సమస్యలను తీర్మానంగా ప్రవేశపెడతాం

సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): ఈనెల 21 నుంచి ఐదు రోజులపాటు పంజాబ్ రాష్ట్రంలోని చండీఘర్లో జరగనున్న సిపిఐ జాతీయ మహాసభలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి తొమ్మిది మందికి అవకాశం లబించించి. ఎంపికైన ప్రతినిధులు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాధం, కల్లూరి వెంకటేశ్వర్ రావు, నరాటి ప్రసాద్, సారెడ్డి పుల్లారెడ్డి, మున్నా లక్ష్మీకుమారి, ఎస్డీ సలీం, సలిగంటి శ్రీనివాస్, దేవరకొండ శంకర్ శనివారం చండీఘర్కు బయలుదేరివెళ్లారు, రాష్ట్ర పార్టీ కోటానుంచి కొత్తగూడెంకు చెందిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు ప్రతినిధిగా పాల్గొననున్నారు.

ఈ సందర్బంగా జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా మాట్లాడుతూ రాష్ట్రంలోని కోల్బెర్ట్ ప్రాంతాల్లో ప్రతిపాదనలో వున్న నూతన బొగ్గుగనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అదేవిధంగా మహాత్మగాంధీ గ్రామీణ ఉపాధి హామీపథకం, వన్ ఆఫ్ సెవెంటీ చట్టం అమలు, కార్మిక చట్టాల, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా,  గ్రామీణ ప్రాతంలో గిరిజన, గిరిజనేత పేదల భూ సమస్యలు, విమానాశ్రయం, జిల్లాలో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు వంటి వాటిపై జిల్లా తరుపున తీర్మానం ప్రవేశపెడతామని తెలిపారు.