calender_icon.png 20 September, 2025 | 10:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి

20-09-2025 08:19:55 PM

కరీంనగర్ క్రైమ్ (విజయక్రాంతి): బహుజన్ సమాజ్ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం కరీంనగర్ గోపి కృష్ణ ఫంక్షన్ హాల్ల్ లో జరుగగా దీనికి ముఖ్య అతిథులు నేషనల్ కో ఆర్డినేటర్ అతర్ సింగ్ రావు ఎక్స్ ఎమ్మెల్సీ హాజరయ్యారు. వారికి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నుండి గోపి కృష్ణ ఫంక్షన్ హాలుకు ఘనంగా స్వాగత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని అయన కోరారు. ఈ దేశంలో అత్యధిక జనాభా కలిగిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ, అగ్ర వర్ణ పేదలు, కాని వీళ్లంతా రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారు.

కావున రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీని గెలిపించాలని అయన కోరారు. ఈ సందర్బంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న అన్ని జిల్లా కమిటీలను మన మహనీయులు కన్న కళలను నిజం చేయడానికి అందరూ కష్టపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ కో ఆర్డినేటర్ సురేష్ ఆర్య రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రం శేఖర్ రాష్ట్ర కో ఆర్డినేటర్ దగిల్ల దయానంద రావు,నిషాని రామచంద్రం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎనగందుల వెంకన్న మాతంగి అశోక్, కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ అక్కి బాలకిషన్ జిల్లా అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.