calender_icon.png 20 September, 2025 | 10:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇంటి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

20-09-2025 08:22:07 PM

బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గందె రామచందర్..

మందమర్రి (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇంటి పథకంలో ఎంపికైన లబ్ధిదారులు త్వరగా ఇంటి నిర్మాణాన్ని పూర్తిచేసి, పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గందె రామచందర్ కోరారు. మండలంలోని చిర్రకుంట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు పథకం లబ్ధిదారులు దుర్గం తార ఇంటి నిర్మాణంలో స్లాబ్ పూర్తయిన సందర్భంగా హౌసింగ్ శాఖ ఏఈ జోష్నా ఇంటి నిర్మాణాన్ని పరిశీలించి, మూడవ బిల్లు మంజూరుకు శనివారం ప్రతిపాదనలు పంపారు. ఈ సందర్భంగా రామచందర్ మాట్లాడుతూ, గత బిఆర్ఎస్ ప్రభుత్వ 10 సంవత్సరాల కాలంలో ఒక నిరుపేదకు ఇల్లు నిర్మించి ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల అభ్యున్నతికి పాటుపడుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్ పాల్గొన్నారు.