16-09-2025 06:52:28 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): ప్రపంచ ఓజోన్ పొర సంరక్షణ దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కలవల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కల్వలలో విద్యార్థుల చేత ‘O3’ ఆకారంలో ఓజోన్ పొర విశిష్టతను తెలియజేసే చిత్రాన్ని, విద్యార్థుల చేత గొడుగు లాగా సంరక్షణగ సూచించే విధంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ ఎం బండారు నరేందర్ మాట్లాడుతూ ఓజోన్ ఒక గొడుగు లాగా అందరం కలిసికట్టుగా సంరక్షించాలని, కాలుష్యాన్ని నివారించి మొక్కలను పెంచడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందన్నారు.