calender_icon.png 17 September, 2025 | 8:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్లమెంట్‌లో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

22-07-2024 01:18:49 PM

న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. రేపు పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్ లో కేంద్రమంత్రి నిర్మాలా సీతారామన్ ఆర్థిక సర్వే 2023-24ప్రవేశపెట్టారు. 2023-24 లో 8.2 వృద్ధి సాధించినట్లు ఆర్థిక సర్వేలో వెల్లడించారు. 2024-25లో వృద్ధి రేటు 6.5-7 ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్‌లో ఆర్థిక సర్వే పత్రాన్ని సమర్పించారు. ఆర్థిక సర్వే అనేది ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ సమగ్ర సమీక్ష లేదా వార్షిక నివేదిక. భారత ముఖ్య ఆర్థిక సలహాదారు మార్గదర్శకత్వంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల విభాగం ద్వారా తయారు చేయబడుతోంది.