22-07-2024 02:15:21 PM
హైదరాబాద్: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పురితో భేటీ అయ్యారు. రూ, 500కే సిలిండర్ సరఫరా విషయాన్ని కేంద్రమంత్రికి సీఎం తెలిపారు. వినియోగదారులకు ఇచ్చే రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు (ఓఎంసీ) చెల్లించే అవకాశాన్ని కల్పించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, అధికారులు ఉన్నారు.