28-05-2025 12:00:00 AM
గచ్చిబౌలి ఓఆర్‌ఆర్ నుంచి కొండాపూర్ ఫ్లైఓవర్ త్వరలో ప్రారంభం
శేరిలింగంపల్లి, మే 27: గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్ ఫ్లై ఓవర్ త్వ రలో ప్రారంభం కానుంది. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నగరవాసులకు, ప్రధానంగా ఐటీ కారిడార్లో ప్ర యాణించే వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొం డాపూర్కు వెళ్లే అత్యాధునిక మల్టీ-లెవెల్ ఫ్లై ఓవర్ నిర్మాణం దాదాపు పూర్తయింది.
ఈ ఫ్లై ఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభించనున్నారు. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే గచ్చిబౌ లి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుంది. ప్రయాణ సమయం ఆదా కానుంది.
రెండు ఫ్లైఓవర్ల ప్రాజెక్టు వివరాలు..
ఫ్లై ఓవర్ను రూ.178 కోట్ల వ్యయంతో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా నిర్మించారు. 1.2 కిలోమీటర్ల పొడ వు, 24 మీటర్ల వెడల్పుతో ఆరు లేన్లతో అం దుబాటులోకి రానుంది. ఇది ఇప్పటికే ఉన్న రెండు ఫ్లై ఓవర్లపై నిర్మించిన మూడో స్థాయి నిర్మాణం.
కింద గచ్చిబౌలి జంక్షన్ ఫ్లై ఓవర్, దానిపై శిల్పా లేఅవుట్ ఫేజ్ 1 ఫ్లై ఓవర్ ఉం డగా, ఇప్పుడు దానికి పైన ఫేజ్ 2 ఫ్లై ఓవర్ నిర్మించారు. దీంతో గచ్చిబౌలి జంక్షన్ వద్ద తీవ్రమైన ట్రాఫిక్ సమస్యను ఈ ఫ్లై ఓవర్ చాలా వరకు తగ్గిస్తుంది.
హైటెక్ సిటీ వెళ్లే ప్రయాణికులకు మెరుగైన కనెక్టివిటీ
కొండాపూర్, హఫీజ్పేట్ మార్గాల్లో వెళ్లే వాహనాలకు ఇది చాలా అనుకూలంగా ఉం టుంది. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది. ప్రయాణ సమయం ఆదాతోపాటు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకోకుండా వేగంగా గమ్య స్థానాలకు చేరుకోవచ్చు. కొండాపూర్ ప్రాం తం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్, అక్కడి నుంచి కొండాపూర్ ప్రాంతాలకు వెళ్ళేందు కు గచ్చిబౌలి వద్ద ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా నేరుగా వెళ్లే వెసులుబాటు కలదు.
నగర అభివృద్ధికి సీఎం హామీ..
గతంలో జీహెచ్‌ఎంసీకి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు నగర అభివృద్ధికి నిధులను మంజూరు చేసి జీహెచ్‌ఎంసీకి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. ప్రజాపాలన ప్రభుత్వంలో నగర అభివృద్ధికి హెచ్ సిటీ ద్వారా రూ. 7032 కోట్ల వ్య యంతో 58 పనులు చేపట్టనున్నారు.
అం దులో 28 ఫ్లైఓవర్లు, 13 అండర్ పాస్ లు, నాలుగు ఆర్వోబీలు, మూడు రైల్వే అండర్ బ్రిడ్జిలు, 10 రోడ్డు వెడల్పు పనులు చేపట్టేందుకు ప్రతిపాదించారు. ఈ పనులను టెం డర్ దశ పూర్తిచేసి అగ్రిమెంట్ దశలో ఉన్నా యి. ఈ పనులను కొన్ని జూన్ మాసంలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.