28-09-2025 04:35:22 PM
హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ కు గడువు లేదు
తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు
సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్
రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): వాహనాల నంబరు ప్లేట్ల మార్పుపై వాహనదారులు ఆందోళన చెందవద్దని సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ ఒక ప్రకటనలో తెలిపారు. పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్(హెచ్ఎస్ఆర్పీ)లు బిగించేందుకు ఎలాంటి గడువు విధించలేదని స్పష్టం చేశారు. ఈ నెల 30వ తేదీలోగా హెచ్ఎస్ఆర్ పీ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని లేకుంటే రవాణా, పోలీసు శాఖల ఆధ్వర్యంలో జరిమానాలు విధిస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు. వాహనాలకు నంబరు ప్లేట్ల మార్పు అంశం ఇంకా ప్రభుత్వ పరిశీలనలోనే ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని డీటీఓ సూచించారు.