28-09-2025 04:44:22 PM
గుండాల (విజయక్రాంతి): బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అన్నారు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బీర్ల అనిత ఐలయ్య దంపతులు గుండాల సద్దుల బతుకమ్మ పండుగలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. బీర్ల ఫౌండేషన్ ఛైర్మెన్ బీర్ల అనిత మహిళలతో బతుకమ్మ ఆడారు. గుండాల మండల కేంద్రంలో శనివారం ఏడవ రోజుననే సద్దుల బతుకమ్మ జరుపుకున్నారు. మహిళలు రంగు రంగుల పువ్వులతో బతుకమ్మలు పేర్చారు. దేవతల బండపై మహిళలు బతుకమ్మ పాటలతో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ తొమ్మిది రోజులకు బదులుగా, ఏడవ రోజున జరుపు కోవడం ఇక్కడి ఆనవాయితీ అన్నారు.ఆడుకునే స్థలంలో ఏర్పాటు చేసిన మౌలిక వసతుల పై సంతృప్తి వ్యక్తం చేశారు .