calender_icon.png 28 September, 2025 | 1:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్ షేక్ పేటలో పర్యటించిన కేటీఆర్

28-09-2025 12:11:13 PM

హైదరాబాద్: జూబ్లీహిల్స్, షేక్ పేటలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. ఇంటింటికి వెళ్లి 'కాంగ్రెస్ బకాయి కార్డు' పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి వర్గానికి ఎంత బాకీ ఉందో కార్డు ముద్రించి పంపిణీ చేసిన కేటీఆర్ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ మోసాన్ని బాకీ కార్డులతో ఎండగడతామని చెప్పారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... కాంగ్రెస్ బుద్ధి చెప్పే అవకాశం ఉపఎన్నిక, స్థానిక ఎన్నికల రూపంలో వచ్చిందని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ గుణపాఠం తప్పదని ఆయన చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేసేది టూరిస్టు మంత్రులని, ఎన్నికలు అయిపోగానే మంత్రులు, సామంతులు అందరూ గాయబ్ అవుతారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.