అభివృద్ధిలో రాజకీయం వద్దు.. ఎంపీ మల్లు రవి
తలకొండపల్లి, జూన్ 22 (విజయక్రాంతి): యువత స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుని ఆర్థికంగా ముందుకు సాగాలని నాగర్కర్నూల్ పార్లమెంటు సభ్యులు మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని గట్టు ఇప్పలపల్లి గ్రామంలో నూతనంగా మంజూరైన యూనియన్ బ్యాంక్ శాఖను సోమవా రం ఆయన కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, జైపాల్ యాద వ్, మాజీ ఓబీసీ సభ్యుడు ఆచారిల తో కలిసి వైభవంగా ప్రారంభించారు. గ్రామాభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా నాయకులంతా కలిసి పనిచేయడం శుభపరిణామ మని ఎంపీ కొనియాడారు. గట్టు ఇప్పలపల్లి గ్రామానికి బ్యాంకు మంజూరు కావడం వెనుక అన్ని పార్టీల నాయకుల ఉమ్మడి కృ షి ఉందన్నారు.
కల్వకుర్తి నియోజకవర్గానికి రూ.1,400 కోట్ల నిధులు:
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. గట్టు ఇప్పలపల్లి గ్రామ ప్రజల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ బ్యాంకు ఏర్పాటు కావడం సంతోషకరమన్నారు. నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం ఇప్పటికే రూ.1,400 కోట్ల నిధులను మంజూరు చేయించినట్లు వెల్లడించారు. అలాగే రహదారుల విస్తరణ, అభివృద్ధి కోసం మంత్రి సీతక్కను కోరగా తక్షణమే రూ.96 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యేలు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారుల సమక్షంలో ప్రారంభించారు.
జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ.. బ్యాంకు ఏర్పాటు ప్రజా విజయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో టాస్క్ సీఓఓ సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి, రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, యూనియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ రవీంద్రబాబు, డీజీఎం అపర్ణ రెడ్డి, ఏజీఎం లేపాక్షి జగదీష్, మేనేజర్ రవి, ఏఎంసీ చైర్పర్సన్ యాట గీతా నరసింహ, పీఏసీఎస్ చైర్పర్సన్ కేశవరెడ్డిలతో పాటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు, సర్పంచు లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






