04-09-2025 09:11:35 PM
గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చూడాలి..
మంచిర్యాల ఏసీపీ ప్రకాష్..
లక్షెట్టిపేట (విజయక్రాంతి): గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మంచిర్యాల ఏసీపీ ప్రకాష్(ACP Prakash) అన్నారు. గురువారం పట్టణంలోని గోదావరి నది వద్ద నిమజ్జన ఏర్పాట్లను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గణేష్ నవరాత్రుల అనంతరం మండపల నిర్వాహకులతో మాట్లాడి నిమజ్జనం రోజు పూజ కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి చేసుకొని విగ్రహాలను శోభయాత్ర, నిమజ్జన ప్రక్రియ ప్రశాంతమైన వాతావరణంలో జరగాలని, సమస్యత్మక ప్రాంతాలలో నిఘా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. నిమజ్జన ప్రాంతాలలో అన్ని రకాల భద్రత, రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వాహనాలపై వెళ్లే వారిపై రంగులు చల్లకూడదని, విగ్రహాల ఎత్తును బట్టి నిర్దేశించిన స్థానాలకు విగ్రహాలను తీసుకు వెళ్లాలని, శోభాయాత్ర సమయాల్లో విద్యుత్ వైర్లతో జాగ్రత్తగా ఉండాలని, చిన్న పిల్లలను గోదావరి, చెరువుల వద్దకు నిమార్జనానికి తీసులెల్లకూడదని నీటిలో నేరుగా ఎవరు దిగకూడదన్న విషయాలు మండపాల నిర్వాహకులకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిఐ రమణమూర్తి,ఎస్సై సురేష్, తహసీల్దార్ దిలీల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ ఉన్నారు.