22-07-2025 12:28:42 AM
న్యూఢిల్లీ, జూలై 21: పెళ్లంటే నూరేళ్ల పం ట.. ఇది నిన్నటితరం వరకు దంపతులు అ నుసరించిన జీవనమార్గం. కానీ నేటి సమాజంలో వివాహాలు మూణ్నాళ్ల ముచ్చటగా మారిపోతున్నాయి. భార్య భర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్థలే పెద్దవిగా మారి విడాకులకు దారి తీస్తున్నాయి. విడాకుల సమ యంలో భర్త భరణం రూపంలో భార్యకు ఎంతో కొంత ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విడాకుల వల్ల చాలా కుటుంబాలు ఆర్థికంగా చితి కిపోతున్నాయి.
ఒక్కోసారి తన జీవితం మొ త్తం కష్టపడి సంపాదించిన రూపాయిని భర ణం రూపంలో సమర్పించుకోవాల్సి వ స్తోంది. అయితే ధనవంతుల తల్లిదండ్రులు మాత్రం కుమార్తె లేదా కుమారుడి వైవాహిక జీవితానికి విచ్ఛిన్నం కలిగితే భరణం రూపం లో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందుల నుంచి తమను తాము రక్షించుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ ఆస్తులను కాపాడుకునేందుకు తల్లిదండ్రులు ‘ప్రైవేట్ కుటుంబ విచక్షణ ట్రస్ట్’ పేరుతో ఒక ట్రస్ట్‌లను ఏర్పాటు చేసుకుంటున్నారు.
లబ్ధిదారుల ప్రయోజనాలను రక్షించేందుకు ఈ ట్రస్ట్ ఉపయోగపడనుంది. ఉదాహరణకు తమ కుమారుడు విడాకులకు దరఖాస్తూ చేసుకుంటే.. అతడి భార్య సహ యజమానిగా భావించి ట్రస్టీలో ఉన్న ఆస్తులను ఇవ్వాలని కోరుతూ దావా వేయడానికి అవకాశముండదు. దీంతో భరణం రూపంలో కొంత మొత్తం చెల్లించినప్పటికీ ట్రస్టీలో ఉన్న ఆస్తులకు ఢోకా ఉండదు.
భారతదేశంలో ఒకప్పుడు అత్యంత ధనవంతు లకు మాత్రమే పరిమితమైన ఈ ధోరణి ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలకు కూ డా పాకింది. ముఖ్యంగా విడాకుల విషయం లో తమ ఆదాయాన్ని రక్షించుకోవడానికి ఈ ట్రస్టీలు బాగా ఉపయోగపడుతున్నాయి.
అయితే ఈ ట్రస్టీలు మహిళలను కూడా రక్షిస్తుంది. ఆర్థిక సహాయం చేయాలని భర్త అహేతుక డిమాండ్లను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు.. సదరు మహిళ.. తన తండ్రి సృ ష్టించిన ప్రైవేట్ ట్రస్టీలో కూతురు, పిల్లల పేర్లు చేర్చితే తన ఆస్తులను కాపాడుకునే వీలుంది.